బీబీనగర్ రూరల్, అక్టోబర్ 11: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జమిలపేట గ్రామంలోని విజేత పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ నెల్లూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను చాటుతూ, సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. భావితరాలకు మన సంస్కృతిని అందించడంలో ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ నెల్లూరు వసంత, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి