Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బస్సులో విషాదం.. ఛాతినొప్పితో యువ రీసెర్చ్ స్కాలర్ మృతి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 05:20 PM

మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలి. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి.

11-10-2026 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చంపాపేట: మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చంపాపేట మోడల్ మార్కెట్ బిల్డింగ్‌లో నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ట్రస్ట్ చైర్మన్ కమల సుధీర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి చంపాపేట డివిజన్ యువ నాయకురాలు సంధ్య రవి ముదిరాజ్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలకు నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా వారు సొంతంగా ఉపాధి అవకాశాలు పొందడంతోపాటు కుటుంబ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతారని పేర్కొన్నారు. మహిళల స్వావలంబన లక్ష్యంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుట్టు శిక్షణతోపాటు బ్యూటీషియన్, మెహందీ వంటి కోర్సుల్లోనూ శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు. శిక్షణ పొందిన మహిళలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధిలో రాణించాలని సూచించారు.

కార్యక్రమంలో రమాదేవి, ఉష, ప్యారి, కవిత, లావణ్య, స్వయం ప్రభు, ట్రస్ట్ ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, శిక్షణ పొందిన మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలి. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News