పెద్ద అంబర్‌పేట్‌లో నూతన షోరూమ్ ప్రారంభం
రూ.350 నుంచే చీరలు.. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ప్రత్యేక కలెక్షన్లు
పెద్ద అంబర్‌పేట్, అక్టోబర్ 11:
వినియోగదారుల ఆదరణతో అభివృద్ధి సాధిస్తున్న శ్రీ అక్షయ కలెక్షన్స్ నూతన షోరూమ్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. పెద్ద అంబర్‌పేట్ 52వ డివిజన్ పరిధిలోని విఘ్నేశ్వర నగర్ కాలనీ కమాన్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‌ను నాగోల్ మాజీ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు వడ్డేపల్లి విద్యావిజేందర్‌రెడ్డి, దండెం కృష్ణారెడ్డి, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు పిల్లి బాల మల్లేష్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారుల ఆదరణకు అనుగుణంగా షోరూమ్‌ను విస్తరించడం అభినందనీయమన్నారు. నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందించడం ద్వారా మరింత ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.
అన్ని రకాల వస్త్రాలు ఒకేచోట
షోరూమ్ నిర్వాహకులు డి.యాదగిరి, జ్యోతి దంపతులు మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా విభిన్న రకాల నూతన వస్త్ర కలెక్షన్లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. రూ.350 నుంచి రూ.20 వేల వరకు వివిధ రకాల చీరలు లభిస్తాయని పేర్కొన్నారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు అవసరమైన బ్రైడల్, పట్టు, ఫ్యాన్సీ, రోజువారీ వినియోగ చీరలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. హోల్‌సేల్ ధరలకు వస్త్రాలు విక్రయించడంతోపాటు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు వ్రిందా రెడ్డి, హ్యాపీ, స్థానిక ప్రముఖులు, కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు. నూతన కలెక్షన్లను పరిశీలించి కొనుగోళ్లు చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి