Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బస్సులో విషాదం.. ఛాతినొప్పితో యువ రీసెర్చ్ స్కాలర్ మృతి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 05:19 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై కాంగ్రెస్‌ ఫోకస్‌. మధుయాష్కీతో అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డి భేటీ.

11-10-2026 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డి బంజారాహిల్స్‌లో మాజీ ఎంపీ, ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌ జాతీయ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మధుయాష్కీ ఆయనకు స్వీట్లు తినిపించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డితో కలిసి నేతలు ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా నియోజకవర్గవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ఓటరు నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో మరింత ముమ్మరం చేయడంపై సమాలోచనలు జరిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై కాంగ్రెస్‌ ఫోకస్‌. మధుయాష్కీతో అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డి భేటీ.

Article Image

హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డి బంజారాహిల్స్‌లో మాజీ ఎంపీ, ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌ జాతీయ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మధుయాష్కీ ఆయనకు స్వీట్లు తినిపించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డితో కలిసి నేతలు ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా నియోజకవర్గవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ఓటరు నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో మరింత ముమ్మరం చేయడంపై సమాలోచనలు జరిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News