Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అభివృద్ధి నిరంతర ప్రక్రియ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:04 PM

నరసింహులగూడెంలో ఎన్‌పీఎల్ సీజన్-3 క్రికెట్ పోటీలు ప్రారంభం

11-10-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మునగాల మండలం నరసింహులగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం నరసింహులగూడెం ప్రీమియర్ లీగ్ (ఎన్‌పీఎల్) సీజన్-3 క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను గ్రామ సర్పంచ్ ఇందిరా నరసయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు. క్రీడలు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారికి సరైన అవకాశాలు కల్పిస్తే ఉన్నత స్థాయికి ఎదగగలరని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ స్నేహభావంతో పోటీల్లో పాల్గొనాలని కోరారు. గ్రామంలో క్రీడాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జూలకంటి కొండారెడ్డి, మార వెంకట్ రెడ్డి, గణేష్, క్రికెట్ సీనియర్ క్రీడాకారుడు రామారావు, క్రీడాకారులు శివ, సురేష్, వీరబాబు, వెంకటేష్, ఎస్కే జానీ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నరసింహులగూడెంలో ఎన్‌పీఎల్ సీజన్-3 క్రికెట్ పోటీలు ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News