యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని ఎంబావి గ్రామానికి చెందిన షేక్ జమాల్ (30) విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. వ్యవసాయ పొలంలో సాగునీటి ఇనుప పైపులను మారుస్తుండగా విద్యుత్ ప్రవహించి షాక్ తగలడంతో కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో భువనగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నారులతో భార్యకు కన్నీటి కష్టాలు
జమాల్‌కు భార్య నిష్మాతో పాటు నాలుగేళ్ల కుమారుడు, ఆరు నెలల పాప ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి అతడే ఆధారం. కుటుంబ పెద్ద మృతితో భార్య, ఇద్దరు చిన్నారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. భర్త మృతదేహం వద్ద భార్య రోదించిన తీరు అక్కడివారిని కలచివేసింది.
ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని, చిన్నారుల పోషణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేను, ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి