మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో బాధితునికి వైద్య సహాయం.
12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్ కృషితో నిరుపేదకు భరోసా.
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన చిందం రవి, కాలు మోకాలు పైభాగం వరకు తీవ్ర గాయమై కాలిపోయిన దుస్థితిలో కొట్టుమిట్టాడుతుండగా.. ఆయన వైద్యం నిమిత్తం అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకు వచ్చారు. శనివారం నాడు చౌటుప్పల్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీసులో 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్ ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమం నిర్వహించారు.బాధిత కుటుంబం తన దృష్టికి తీసుకురాగానే, వెంటనే స్పందించిన 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్.. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ సహకారంతో ఈ సమస్యను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే బాధితుడి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2,50,000 ఎల్ఓసీ మంజూరు చేయించారు. ఈ సందర్భంగా మంజూరైన ఎల్ఓసీ పత్రాలను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు కాసర్ల శ్రీనివాసరెడ్డి, కాలనీ అధ్యక్షులు చెరుకు లింగస్వామి గౌడ్ తదితరుల చేతుల మీదుగా బాధితునికి అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, టౌన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన నాయకులను అభినందించారు. కష్టకాలంలో తమను ఆదుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్‌కు బాధితుని కుటుంబం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి