దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జై భవాని యూత్ అసోసియేషన్, శ్రీ విజయ దుర్గ అసోసియేషన్ సభ్యులు స్థానిక సీఐ వెంకటేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మైక్ వినియోగానికి సంబంధించిన అనుమతుల కోసం అవసరమైన పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ విజయ దుర్గ అసోసియేషన్ పాత కేరి సభ్యులు ఉత్సవాలకు సంబంధించిన ప్రత్యేక కరపత్రాన్ని సీఐ వెంకటేష్‌కు అందజేశారు. నవరాత్రి ఉత్సవాల్లో నిర్వహించనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలకు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని సీఐ వెంకటేష్‌ను అసోసియేషన్ సభ్యులు ఆత్మీయంగా ఆహ్వానించారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సభ్యులు తెలిపారు.
PRINT TIME: October 10, 2026 10:04 PM
దసరా నవరాత్రి ఉత్సవాలకు సీఐ వెంకటేష్‌కు ఆహ్వానం

10-10-2026
16 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జై భవాని యూత్ అసోసియేషన్, శ్రీ విజయ దుర్గ అసోసియేషన్ సభ్యులు స్థానిక సీఐ వెంకటేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మైక్ వినియోగానికి సంబంధించిన అనుమతుల కోసం అవసరమైన పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ విజయ దుర్గ అసోసియేషన్ పాత కేరి సభ్యులు ఉత్సవాలకు సంబంధించిన ప్రత్యేక కరపత్రాన్ని సీఐ వెంకటేష్‌కు అందజేశారు. నవరాత్రి ఉత్సవాల్లో నిర్వహించనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలకు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని సీఐ వెంకటేష్‌ను అసోసియేషన్ సభ్యులు ఆత్మీయంగా ఆహ్వానించారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సభ్యులు తెలిపారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి