Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మాల నిరుద్యోగులు, విద్యార్థుల ఆవేదన.. హక్కుల కోసం పోరాటానికి పిలుపు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:18 PM

బోరంచ నల్లపోచమ్మ ఆలయంలో రేపటి నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు

10-10-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామ శివారులో వెలసిన శ్రీ నల్లపోచమ్మ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శివరుద్రప్ప శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక పూజలు,అలంకరణలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.అక్టోబర్ 11న బాలా త్రిపుర సుందరి దేవి,12న గాయత్రి దేవి,13న అన్నపూర్ణ దేవి,14న మంగళ గౌరీ దేవి,15న లలితా దేవి,16న సరస్వతీ దేవి,17న మహాలక్ష్మీ దేవి,18న దుర్గాదేవి,19న మహిషాసుర మర్దిని దేవి,20న రాజరాజేశ్వరి దేవి అలంకరణల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు సామూహిక కుంకుమార్చన,11.45 గంటలకు మహా నివేదన,అనంతరం తీర్థప్రసాదాల పంపిణీ నిర్వహించనున్నట్లు తెలిపారు.అలాగే ప్రతిరోజూ సాయంత్రం 4.30 గంటలకు పండితులచే ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.అక్టోబర్ 20న మంగళవారం సాయంత్రం 6 గంటలకు శమీ పూజతో మహోత్సవాలు ముగియనున్నాయి.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు కోరారు.

Sthanikam

బోరంచ నల్లపోచమ్మ ఆలయంలో రేపటి నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News