Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మాల నిరుద్యోగులు, విద్యార్థుల ఆవేదన.. హక్కుల కోసం పోరాటానికి పిలుపు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:49 PM

చౌటుప్పల్‌లో మెరుపు ధర్నాకు దిగొచ్చిన యంత్రాంగం!

10-10-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వలిగొండ రోడ్డు జంక్షన్ మార్గం పునరుద్ధరణ

రాత్రికే రాత్రే రోడ్డును పునరుద్ధరించిన అధికారులు

స్థానికుల హర్షం.. శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సమరదీక్షకు దక్కిన ప్రతిఫలం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యపై నిర్వహించిన పోరాటం తుది ఫలితాన్నిచ్చింది. వలిగొండ రోడ్డు జంక్షన్ వద్ద ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న రాకపోకల తీవ్ర ఇబ్బందులను పరిష్కరించాలంటూ శుక్రవారం రాత్రి స్థానిక నాయకుడు చెరుకు శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజలు చేపట్టిన మెరుపు ధర్నాకు అధికారులు సానుకూలంగా స్పందించారు.

​వలిగొండ రోడ్డు జంక్షన్ మార్గం మూసివేత, ఇబ్బందుల వల్ల నిత్యం తీవ్ర నరకం చూస్తున్నామని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ స్థానికులతో కలసి శివకుమార్ గౌడ్ రోడ్డుపై ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు, సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. సమస్య తీవ్రతను గుర్తించి, రాకపోకలకు వీలుగా రోడ్డు మార్గం పునరుద్ధరణ పనులను చేపట్టి మార్గాన్ని సుగమం చేశారు. అనంతరం చెరుకు శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ పోరాటం సాగుతుందని తెలిపారు. ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుని, వేగంగా స్పందించి మార్గాన్ని పునరుద్ధరించిన సంబంధిత అధికారులు, సిబ్బంది, ఈ పోరాటంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాడతానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ​ప్రజా సమస్యల పట్ల తక్షణమే స్పందించి, రాత్రికి రాత్రే పోరాటం నిర్వహించి మార్గాన్ని పునరుద్ధరించేలా చేసిన శివకుమార్ గౌడ్ చొరవను చౌటుప్పల్ స్థానికులు, వాహనదారులు తీవ్రంగా అభినందించారు.

Sthanikam

చౌటుప్పల్‌లో మెరుపు ధర్నాకు దిగొచ్చిన యంత్రాంగం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News