పేదరికం మధ్య ప్రజాసేవ.. సొంతింటి కోసం సుష్మ వేడుకోలు
త్రిపురారం: నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కామారెడ్డి గ్రామ సర్పంచ్ పాపకంటి సుష్మ పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. పేదరికం వెంటాడుతున్నా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న ఆమెను గ్రామస్థులు సర్పంచ్‌గా ఎన్నుకున్నారు.
తన నిజాయతీని గుర్తించి ప్రజలు తనకు బాధ్యతలు అప్పగించారని సుష్మ తెలిపారు. తనతో పాటు గ్రామంలో మరో 10 మంది పేద కుటుంబాలు కూడా గుడిసెల్లోనే జీవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆమె కోరుతున్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి