Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:23 AM

లారీల్లో డీజిల్‌ దొంగతనం.. ఒకరి అరెస్ట్‌ రూ.1.70 లక్షలు, కారు, మొబైల్‌ స్వాధీనం.. మరో ఐదుగురు పరారీ.

10-10-2026 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వలిగొండ, స్థానిక న్యూస్‌: ఆగి ఉన్న లారీల నుంచి డీజిల్‌ దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రామన్నపేట సీఐ మోలుగూరి రవి తెలిపారు. శుక్రవారం వలిగొండ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.

ఈ నెల 21న వలిగొండ మండలంలోని లోతుకుంట గ్రామానికి చెందిన లారీ యజమానులు తమ వాహనాలను మండల కేంద్రంలోని భారత్‌ పెట్రోల్‌ బంకు వద్ద నిలిపి ఉంచారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు మూడు లారీల డీజిల్‌ ట్యాంకర్ల తాళాలు పగలగొట్టి 750 లీటర్ల డీజిల్‌ను క్యాన్లలో నింపుకుని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ నేపథ్యంలో గురువారం ఉదయం అంబేద్కర్‌ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, హైదరాబాద్‌లోని బోరబండకు చెందిన సయ్యద్‌ సోహెల్‌ అలియాస్‌ పప్పు సోహెల్‌ అద్దె కారులో వస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో డీజిల్‌ దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించినట్లు సీఐ తెలిపారు.

సోహెల్‌కు గతంలో జైలులో పరిచయమైన గణేష్‌, సల్మాన్‌, షఫీ, ఇమ్రాన్‌ తదితరులు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు వెల్లడించారు. డీజిల్‌ విక్రయం ద్వారా వచ్చిన రూ.1.70 లక్షల నగదు, నీలిరంగు బాలెనో కారు, మొబైల్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి, పోలీసు సిబ్బందిని సీఐ రవి అభినందించారు.

Sthanikam

లారీల్లో డీజిల్‌ దొంగతనం.. ఒకరి అరెస్ట్‌ రూ.1.70 లక్షలు, కారు, మొబైల్‌ స్వాధీనం.. మరో ఐదుగురు పరారీ.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News