Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిరుపేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేతలు.. రూ. 2.50 లక్షల ఎల్ఓసీ అందజేత! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 03:32 AM

ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు

09-04-2026 242 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ : ABN ఆంధ్రజ్యోతి ఛానల్‌లో ప్రసారమైన “వీకెండ్ కామెంట్ బై ఆర్‌కే” కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీమతి ఉషాశ్రీచరణ్ పెనుకొండ డీఎస్పీని కోరారు.

ఇటీవల ప్రసారమైన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై అవమానకర, అసత్య వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు జర్నలిజం నైతిక విలువలకు విరుద్ధంగా ఉండి, ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రత్యేకంగా మహిళల గౌరవాన్ని దెబ్బతీయే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని, పార్టీ నాయకులు, కార్యకర్తలను దూషించేలా ప్రసారం చేశారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం డిజిటల్ వేదికల్లో కూడా విస్తృతంగా వ్యాప్తి చెందడంతో సామాజిక విభేదాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

కావున, సంబంధిత యాంకర్, ఎడిటర్, మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అలాగే, ఆ దూషణాత్మక కంటెంట్‌ను అన్ని వేదికల నుంచి తొలగించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, మండల కన్వీనర్లు పాల్గొన్నారు.

Sthanikam

ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News