Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:15 PM

పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం కారును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నలుగురు దుర్మరణం

05-07-2026 1,007 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూలై 5: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

మృతుల్లో ఇద్దరు మహిళలు, ఏడేళ్ల బాలుడు ఉన్నట్లు ప్రాథమిక వివరాలు వెల్లడిస్తున్నాయి. ప్రమాదం తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, ఘటనాస్థలిలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

అతివేగమే ప్రమాదానికి కారణమా, లేక ఇతర సాంకేతిక కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం కారును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నలుగురు దుర్మరణం

Article Image

చిట్యాల, జూలై 5: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

మృతుల్లో ఇద్దరు మహిళలు, ఏడేళ్ల బాలుడు ఉన్నట్లు ప్రాథమిక వివరాలు వెల్లడిస్తున్నాయి. ప్రమాదం తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, ఘటనాస్థలిలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

అతివేగమే ప్రమాదానికి కారణమా, లేక ఇతర సాంకేతిక కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News