Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:31 AM

దొడ్డి కొమరయ్య ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి: డాక్టర్ బంటు కృష్ణ

04-07-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఘనంగా నివాళులు

తెలంగాణ తొలి అమరుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని పురస్కరించుకుని శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు డాక్టర్ బంటు కృష్ణ దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ ఉద్యమ చరిత్రలో దొడ్డి కొమరయ్య చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. సామాజిక న్యాయం, రైతాంగ హక్కుల కోసం ఆయన చేసిన త్యాగాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. చరిత్రను మరువకుండా మహనీయుల ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

దొడ్డి కొమరయ్య వంటి అమరవీరుల త్యాగాల ఫలితంగానే సమాజంలో ప్రజాస్వామ్య విలువలు బలపడుతున్నాయని, వారి స్ఫూర్తిని భావితరాలకు చాటిచెప్పాల్సిన అవసరం ఉందని డాక్టర్ బంటు కృష్ణ అన్నారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొని దొడ్డి కొమరయ్యకు ఘనంగా నివాళులర్పించారు.

Sthanikam

దొడ్డి కొమరయ్య ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి: డాక్టర్ బంటు కృష్ణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News