Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:34 AM

రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ

27-06-2026 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

రొద్దం, జూన్ 27: రొద్దం మండల కేంద్రంలోని అనంతశక్తి సొసైటీ ఆవరణలో అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ ఘనంగా నిర్వహించారు. అధ్యక్షురాలు సుశీలమ్మ, కార్యనిర్వాహణ అధికారి లావణ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టింబుక్టూ కలెక్టివ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుకన్య, వ్యవస్థాపకులు బబ్బులు గంగూలీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సుకన్య మాట్లాడుతూ, గత ఏడు సంవత్సరాలుగా అనంతశక్తి సొసైటీ గణనీయమైన అభివృద్ధి సాధించిందని, ప్రస్తుతం 10,459 మంది సభ్యులతో రూ.20.97 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవడం అభినందనీయమన్నారు. సభ్యత్వం పెరిగిన నేపథ్యంలో మరింత క్రమశిక్షణ, పారదర్శకతతో సంస్థను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. మహిళలు సామాజిక, ఆర్థికంగా ఎదుగుతున్నప్పటికీ వారిపై హింస కొనసాగుతోందని, అలాంటి సమస్యలను సంఘటిత శక్తితో ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు.

టింబుక్టూ కలెక్టివ్ వ్యవస్థాపకులు బబ్బులు గంగూలీ మాట్లాడుతూ, మహిళలే స్వయంగా సంస్థను నిర్వహిస్తూ నిర్ణయాలు తీసుకోవడం అరుదైన విషయమని కొనియాడారు. దేశంలో ఇలాంటి మహిళా ఆధ్వర్య సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయని, అనంతశక్తి సొసైటీ వాటిలో ఒకటిగా నిలిచిందన్నారు. మహిళల హక్కుల పరిరక్షణ కోసం అహింసా మార్గంలో పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

అనంతరం సీఈవో లావణ్య వార్షిక నివేదికను, అకౌంటెంట్ మాధవి ఆర్థిక నివేదికను సభలో ప్రవేశపెట్టారు. పాలకవర్గంలో మార్పులు, చేర్పులు చేపట్టడంతో పాటు, సంస్థ భవిష్యత్ కార్యాచరణపై సభ్యులతో చర్చించారు.

ఈ కార్యక్రమంలో మహాశక్తి సీఈవో రమీజ, మేనేజర్ గౌరి, అనంతశక్తి పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, మహిళా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News