Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:33 AM

చెరుకూరులో ప్రకృతి వ్యవసాయ శిక్షణ – రైతులకు నూతన సాగు మార్గాలు

28-04-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

రొద్దం మండలం చెరుకూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంపొందించే దిశగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రైతు రేగడి నరసింహప్ప పొలంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రాజేష్ మాట్లాడుతూ, తక్కువ వర్షపాతం పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాన్ని అనుసరించాలని సూచించారు. ఈ విధానం ద్వారా వర్షాలపై ఆధారపడకుండా ముందుగానే విత్తనం వేసి మంచి దిగుబడులు సాధించవచ్చని వివరించారు.

మండల మాస్టర్ ట్రైనర్ భార్గవ్, APCNF పరిధిలో అమలవుతున్న వివిధ సాగు నమూనాలను క్షేత్ర స్థాయిలో వివరించారు. ముఖ్యంగా Half-Moon, ATM, Dr.Pr., A-Grade మోడల్స్ ద్వారా నీటి వినియోగాన్ని తగ్గిస్తూ, పంట దిగుబడులను పెంచే మార్గాలను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి.రాజేష్, ఏఈఓ హంసవేణి, రైతు సేవ కేంద్రం సిబ్బంది, ICRPలు మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ శిక్షణతో రైతులు వర్షాభావ పరిస్థితుల్లో కూడా సమర్థవంతమైన సాగు పద్ధతులను అవలంబించేందుకు అవగాహన పొందారు.

Sthanikam

చెరుకూరులో ప్రకృతి వ్యవసాయ శిక్షణ – రైతులకు నూతన సాగు మార్గాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News