Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:33 AM

పెనుకొండలో బీసీ విద్యార్థులకు వరం.. కొత్తగా 3 హాస్టళ్లు మంజూరు

08-05-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ నియోజకవర్గంలోని బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిగి, రొద్దం, సోమందేపల్లిలో కొత్తగా మూడు బీసీ హాస్టళ్లు మంజూరు చేసింది. వీటిలో పరిగి, రొద్దంలో బాలికల హాస్టళ్లు, సోమందేపల్లిలో బాలుర హాస్టల్ ఏర్పాటు కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచే హాస్టళ్లు ప్రారంభం కానుండగా, విద్యార్థుల చేరికల కోసం జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు.

ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో 61 బీసీ హాస్టళ్లు ఉండగా, కొత్తగా మంజూరైన మూడు హాస్టళ్లతో సంఖ్య 64కు చేరనుంది. పెనుకొండ నియోజకవర్గంలో ఇప్పటికే ఉన్న నాలుగు హాస్టళ్లకు ఇవి తోడవడంతో గ్రామీణ, పేద, వలస కూలీల పిల్లలకు విద్యా అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.

కొత్త హాస్టళ్ల నిర్వహణ కోసం హెచ్‌డబ్ల్యూఓలు (వార్డెన్లు) నియామక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. సిబ్బంది కొరత నేపథ్యంలో ఇతర శాఖల ఉద్యోగులను డిప్యూటేషన్‌పై నియమించే అంశంపై జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు. త్వరలోనే కమిటీ ఏర్పాటు చేసి నియామకాలు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఈ హాస్టళ్ల మంజూరులో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక పాత్ర పోషించారు. పేదరికం కారణంగా బీసీ విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి విషయం తీసుకెళ్లి హాస్టళ్లకు ఆమోదం పొందారు. విద్యార్థుల చేరికల కోసం గ్రామస్థాయిలో తల్లిదండ్రులతో మాట్లాడి అవగాహన కల్పించాలని విద్యాశాఖ అధికారులకు సూచనలు జారీ అయ్యాయి.

“బీసీ బిడ్డలకు ఉన్నత విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం” అని మంత్రి సవిత తెలిపారు. హాస్టళ్లు, గురుకులాల్లో సన్నబియ్యం భోజనం, ఆర్వో తాగునీరు, దోమతెరలు, పారిశుధ్య సిబ్బంది, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి బీసీ విద్యార్థి చదువులో ముందుకు రావాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టళ్లలో చేర్పించాలని ఆమె కోరారు.

Sthanikam

పెనుకొండలో బీసీ విద్యార్థులకు వరం.. కొత్తగా 3 హాస్టళ్లు మంజూరు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News