Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:19 AM

వివాహేతర సంబంధం రుజువైతే భరణం లేదు. ముందుగా ఆరోపణలపై విచారణ.. ఆ తర్వాతే మధ్యంతర భరణంపై నిర్ణయం: సుప్రీంకోర్టు

02-08-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

న్యూఢిల్లీ, ఆగస్టు 2: భార్యకు వివాహేతర సంబంధం ఉందంటూ భర్త చేసిన ఆరోపణలను ముందుగా పరిశీలించి, వాటిపై పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాతే మధ్యంతర భరణం (ఇంటరిమ్ మెయింటెనెన్స్) మంజూరు చేయాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

భార్య నిజంగానే వివాహేతర సంబంధం కొనసాగించినట్లు రుజువైతే, ఆమెకు మధ్యంతర భరణంతో పాటు తుది భరణం పొందే హక్కు కూడా ఉండదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అంతేకాకుండా కేసు విచారణ ఖర్చులు కూడా భర్త నుంచి పొందే హక్కు ఆమెకు ఉండదని వెల్లడించింది.

జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. భారతీయ న్యాయ సంహిత (BNSS) సెక్షన్ 125(4) ప్రకారం భార్య వివాహేతర సంబంధంలో ఉన్నట్లు నిరూపితమైతే భరణానికి అనర్హురాలని ధర్మాసనం గుర్తుచేసింది.

కింది కోర్టుల తీర్పుపై అభ్యంతరం

ఉదయ్‌పూర్‌లోని స్పెషల్ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఓ మహిళకు మధ్యంతర భరణం మంజూరు చేయగా, ఆ నిర్ణయాన్ని రాజస్థాన్ హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు, "వివాహేతర సంబంధం ఆరోపణను కేసు చివర్లో పరిశీలిస్తాం" అని కింది కోర్టులు పేర్కొనడం సరికాదని వ్యాఖ్యానించింది. ముందుగా ఆ ఆరోపణపై విచారణ పూర్తి చేసి, నిజానిజాలు తేలిన తర్వాతే మధ్యంతర భరణంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

ఈ తీర్పు భరణం కేసుల విచారణలో కీలక మార్గదర్శకంగా నిలుస్తుందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Sthanikam

వివాహేతర సంబంధం రుజువైతే భరణం లేదు. ముందుగా ఆరోపణలపై విచారణ.. ఆ తర్వాతే మధ్యంతర భరణంపై నిర్ణయం: సుప్రీంకోర్టు

Article Image

న్యూఢిల్లీ, ఆగస్టు 2: భార్యకు వివాహేతర సంబంధం ఉందంటూ భర్త చేసిన ఆరోపణలను ముందుగా పరిశీలించి, వాటిపై పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాతే మధ్యంతర భరణం (ఇంటరిమ్ మెయింటెనెన్స్) మంజూరు చేయాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

భార్య నిజంగానే వివాహేతర సంబంధం కొనసాగించినట్లు రుజువైతే, ఆమెకు మధ్యంతర భరణంతో పాటు తుది భరణం పొందే హక్కు కూడా ఉండదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అంతేకాకుండా కేసు విచారణ ఖర్చులు కూడా భర్త నుంచి పొందే హక్కు ఆమెకు ఉండదని వెల్లడించింది.

జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. భారతీయ న్యాయ సంహిత (BNSS) సెక్షన్ 125(4) ప్రకారం భార్య వివాహేతర సంబంధంలో ఉన్నట్లు నిరూపితమైతే భరణానికి అనర్హురాలని ధర్మాసనం గుర్తుచేసింది.

కింది కోర్టుల తీర్పుపై అభ్యంతరం

ఉదయ్‌పూర్‌లోని స్పెషల్ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఓ మహిళకు మధ్యంతర భరణం మంజూరు చేయగా, ఆ నిర్ణయాన్ని రాజస్థాన్ హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు, "వివాహేతర సంబంధం ఆరోపణను కేసు చివర్లో పరిశీలిస్తాం" అని కింది కోర్టులు పేర్కొనడం సరికాదని వ్యాఖ్యానించింది. ముందుగా ఆ ఆరోపణపై విచారణ పూర్తి చేసి, నిజానిజాలు తేలిన తర్వాతే మధ్యంతర భరణంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

ఈ తీర్పు భరణం కేసుల విచారణలో కీలక మార్గదర్శకంగా నిలుస్తుందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News