Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:32 AM

ఎంజేపీ గురుకులాల్లో 96.02% రిజల్ట్ – బీసీ విద్యార్థుల ప్రతిభ

30-04-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

రాష్ట్రంలో విడుదలైన పదో తరగతి ఫలితాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలు (ఎంజేపీ) అద్భుత ప్రతిభ కనబరిచాయి. 96.02% ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచాయి. రాష్ట్ర సగటు 85.25%తో పోలిస్తే దాదాపు 10% అధికంగా ఫలితాలు నమోదు చేయడం విశేషం.

ఈ ఏడాది 100 గురుకుల పాఠశాలల్లో 32 పాఠశాలలు 100% ఫలితాలు సాధించాయి. మొత్తం 5,501 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 5,274 మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థుల సంఖ్యాపరంగా ఎంజేపీ గురుకులాలు అగ్రస్థానంలో నిలిచాయి.

ఇటీవల ఇంటర్ ఫలితాల్లోనూ బీసీ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించగా, టెన్త్‌లోనూ అదే జోరు కొనసాగించారు. బీసీ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు కూడా 85.99% ఉత్తీర్ణతతో ప్రతిభ చాటారు.

ఈ విజయంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. మంత్రి లోకేశ్ అమలు చేసిన వంద రోజుల ప్రణాళికల ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు.

అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఈ సందర్భంగా సంబరాలు నిర్వహించారు. అధికారులు, ఎంజేపీ ప్రతినిధులను మంత్రి అభినందించారు.

Sthanikam

ఎంజేపీ గురుకులాల్లో 96.02% రిజల్ట్ – బీసీ విద్యార్థుల ప్రతిభ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News