Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

దండు మల్కాపురంలో గ్రామసభ రసాభాస

దండు మల్కాపురంలో గ్రామసభ రసాభాస

దండు మల్కాపురంలో గ్రామసభ రసాభాస
04-08-2026 296 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నిధుల అవకతవకలపై గ్రామస్తుల నిరసన.. సభ బహిష్కరణ

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో నిర్వహించిన గ్రామసభ తీవ్ర ఉద్రిక్తతల నడుమ రసాభాసగా మారింది. గతంలో ప్రత్యేక అధికారి పాలనలో సుమారు రూ. 1.20 కోట్ల పంచాయతీ నిధులు దుర్వినియోగం కాగా, అందులో ఇంకా తేలాల్సిన రూ. 54 లక్షల బకాయిలపై గ్రామ కార్యదర్శి రమాదేవిని గ్రామస్తులు నిలదీశారు. ఆమె ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో సభను బహిష్కరించి పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.​తాను బిఆర్ఎస్ సర్పంచ్‌ను కావడంతోనే అధికార పార్టీ అండతో కార్యదర్శి రికార్డులు ఇవ్వకుండా పంచాయతీని నిర్లక్ష్యం చేస్తున్నారని సర్పంచ్ గీర్కాటి నిరంజన్ ఆరోపించారు. రికార్డుల కోసం సర్పంచ్‌నైన నన్నే ఆర్ టీ ఐ దరఖాస్తు చేసుకోమంటున్నారని, కలెక్టర్, ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల లెక్క తేలేవరకు ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Sthanikam

దండు మల్కాపురంలో గ్రామసభ రసాభాస

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News