Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:10 AM

ఇంటర్మీడియట్ విద్యార్థులు కష్టపడి లక్ష్యాలు సాధించాలి

04-08-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

ఇంటర్మీడియట్ విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలని కోదాడ ఎన్ ఆర్ ఎస్ కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి అన్నారు. మంగళవారం కాలేజ్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు నిర్వహించిన ఫ్రెషర్ పార్టీలో ఆయన పాల్గొని మాట్లాడారు.విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ దశ కీలకమని ఇక్కడినుండే విద్యార్థి భవిష్యత్తు లక్ష్యాల సాధన ప్రారంభమవుతుందన్నారు. ఇలాంటి ఇంటర్మీడియట్ విద్యలో విద్యార్థులు రాణించేందుకు తమ కాలేజ్ లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. జూనియర్ విద్యార్థులు భయం వీడి సీనియర్ విద్యార్థులతో కలిసిపోవడానికి ఫ్రెషర్ పార్టీ లు ఉపయోగపడతాయని అన్నారు. సీనియర్ విద్యార్థులు జూనియర్స్ కు మార్గదర్శకులుగా ఉండి వారికి సహాయ, సహకారాలు అందించాలని కోరారు. అనంతరం సీనియర్, జూనియర్ విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కాలేజ్ డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాలరావు, ప్రిన్సిపాల్ గంధం వెంకటరమణ (జీ వీ), వైస్ ప్రిన్సిపల్ పీ ఎన్ ఆర్, పలువురు లెక్చరర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంటర్మీడియట్ విద్యార్థులు కష్టపడి లక్ష్యాలు సాధించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News