Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కేతకీ సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న సోలాపూర్ జిల్లా కోర్టు జడ్జి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:58 PM

వడాయిగూడెంలో ఘనంగా వనమహోత్సవం

వడాయిగూడెంలో ఘనంగా వనమహోత్సవం

వడాయిగూడెంలో ఘనంగా వనమహోత్సవం
04-08-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మొక్కల నాటడంలో జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్న ప్రజాప్రతినిధులు.. మహిళా సంఘాల భవనానికి శంకుస్థాపన

భువనగిరి, ఆగస్టు 4: భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గ్రామ సర్పంచ్ నీల శిరీష ఓంప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల భవనానికి శంకుస్థాపన చేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎ. భాస్కర్ రావు మాట్లాడుతూ.. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. వడాయిగూడెంను ఆదర్శ హరిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామ పంచాయతీ చేస్తున్న కృషిని అభినందించారు.

గ్రామంలోని ఊరకుంట పరిసరాల్లో ఈత, ఖర్జూరం, చింత తదితర మొక్కలను జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి నాటారు. సర్పంచ్ నీల శిరీష మాట్లాడుతూ.. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత గ్రామస్తులందరిదేనని, గ్రామాన్ని మరింత పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. నాగిరెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి. తుక్యా నాయక్, జిల్లా పంచాయతీ అధికారి కె. శ్రీనివాస్ రెడ్డి, డీఎల్‌పీఓ బి. శ్రీకాంత్ రెడ్డి, ఎంపీడీఓ జి. విజయలక్ష్మి, ఎక్సైజ్ సీఐ వేణుకుమార్, ఎంపీఓ ఎం. దినకర్, ఏపీఎం మల్లేష్, ఉపసర్పంచ్ సుక్కల శంకర్, పంచాయతీ కార్యదర్శి కె. ఆమని, పాలకవర్గ సభ్యులు, గ్రామీణ ఉపాధి హామీ సిబ్బంది, ఐకేపీ మహిళా సంఘాల ప్రతినిధులు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

వడాయిగూడెంలో ఘనంగా వనమహోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News