Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:10 PM

ఆకారంలో మళ్లీ మానవత్వం ఓడిందా..?

ఆకారంలో మళ్లీ మానవత్వం ఓడిందా..?

ఆకారంలో మళ్లీ మానవత్వం ఓడిందా..?
04-08-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

శాలిగౌరారం మండలం, ఆకారం:

ఆకారం గ్రామంలో ఐతగోని అక్కులయ్య మృతితో మరోసారి కుటుంబ వెలివేత, సహాయ నిరాకరణ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఏడు నెలల క్రితం ఆయన భార్య శాంతమ్మ మరణించిన సమయంలో అంత్యక్రియలు ఆస్తి వివాదంతో వివాదాస్పదంగా మారగా, ఇప్పుడు అక్కులయ్య మరణానంతరం కూడా అదే పరిస్థితి నెలకొన్నట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాధలో ఉన్న కుటుంబానికి గ్రామస్థులు, పెద్దలు చేయూత అందించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక మనిషి చివరి ప్రయాణంలో మానవత్వం, సామాజిక బాధ్యతలు ముందుండాల్సిన సమయంలో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కావడం గ్రామంలో చర్చనీయాంశమైంది.

ఈ ఘటనపై గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సమాజంలో మానవీయ విలువలను కాపాడాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Sthanikam

ఆకారంలో మళ్లీ మానవత్వం ఓడిందా..?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News