Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: సీఐ మన్మథకుమార్

03-08-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నారాయణ పాఠశాలలో విద్యార్థులకు ‘నార్కోటిక్స్’పై అవగాహన సదస్సు

మాదకద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తుతో పాటు కుటుంబాలు, సమాజం తీవ్రంగా దెబ్బతింటాయని చౌటుప్పల్ సీఐ జి.మన్మథకుమార్ హెచ్చరించారు. చౌటుప్పల్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో సోమవారం విద్యార్థులకు నార్కోటిక్స్ (మాదకద్రవ్యాల) దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.​ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎలాంటి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాల బారిన పడకూడదని, చెడు స్నేహాలు, ప్రలోభాలకు లోనుకాకుండా చదువుపైనే దృష్టి సారించి మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. మాదకద్రవ్యాల విక్రయం, రవాణా లేదా వినియోగానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులందరూ మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తామని, డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: సీఐ మన్మథకుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News