నూతన కమిటీని ప్రకటించిన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్
అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) చౌటుప్పల్ మండల నూతన కమిటీని సోమవారం నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరి వెంకటేష్ తెలిపారు. మండల అధ్యక్షుడిగా గుండెబోయిన భాస్కర్, ప్రధాన కార్యదర్శి బరిగెల వేణు ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షుడిగా బద్దుల సాయితేజ, సహాయ కార్యదర్శిగా ఉడుత రాజు, కోశాధికారిగా నీళ్ల రాములను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. చౌటుప్పల్ మండలంలో ఏఐవైఎఫ్ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. స్థానిక యువత ఎదుర్కొంటున్న సమస్యలపై నిలదీస్తూ, యువజన హక్కుల సాధన కోసం పోరాటాలను ఉధృతం చేస్తామని అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి