ఇన్‌స్పెక్టర్ మక్బూల్ జానీ చేతుల మీదుగా 78 సీసీటీవీల ప్రారంభం.
ఇన్‌స్పెక్టర్ మక్బూల్ జానీ చేతుల మీదుగా 78 సీసీటీవీల ప్రారంభం.
Editor Desk
నేను సైతం 2.0' కార్యక్రమంలో భద్రతకు మరో ముందడుగు.
హైదరాబాద్, నాగోల్ ఆగస్టు 2 (స్థానికం ప్రతినిధి):
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా నిర్వహిస్తున్న 'నేను సైతం 2.0' కార్యక్రమంలో భాగంగా నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సహభావన అపార్ట్‌మెంట్స్ సి-బ్లాక్‌లో ఏర్పాటు చేసిన 78 సీసీటీవీ కెమెరాలను నాగోల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సూర్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సీసీటీవీ కెమెరాలు నేరాల నియంత్రణ, దర్యాప్తులో కీలక పాత్ర పోషిస్తాయని, ప్రజల భాగస్వామ్యంతో సమాజంలో భద్రతను మరింత బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సహభావన అపార్ట్‌మెంట్స్ అధ్యక్షుడు చి. శ్రీనివాస్‌రావు, ఉపాధ్యక్షురాలు బి. సంధ్యారాణి, ప్రధాన కార్యదర్శి అబిద్ హుస్సేన్, సలహాదారు జి. అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి