Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:11 PM

గోరింటాకు వేడుకలతో సంప్రదాయాల పరిరక్షణకు బాట

02-08-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్ల మండల ప్రాథమిక పాఠశాలలో శనివారం గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రాధాన్యాన్ని తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకన్న మాట్లాడుతూ, నేటి తరం పిల్లలు, యువత భారతీయ ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని భావితరాలకు అందించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం గౌరీదేవి అనుగ్రహానికి, సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారని తెలిపారు.

అలాగే వర్షాకాలంలో గోరింటాకు శరీరంలోని వేడిని తగ్గించడంతో పాటు ఇన్ఫెక్షన్ల నివారణకు సహజసిద్ధమైన ఔషధంగా ఉపయోగపడుతుందని వివరించారు. విద్యార్థులు సంప్రదాయాల వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను తెలుసుకుని వాటిని ఆచరించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పట్ల మౌనిక జనార్దన్, ఉపాధ్యాయులు యాదయ్య, శిరీష, భవాని, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

గోరింటాకు వేడుకలతో సంప్రదాయాల పరిరక్షణకు బాట

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News