Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:59 PM

డిజిటల్ విద్యలో బీఆర్‌ఏఓయూ మరో ముందడుగు

డిజిటల్ విద్యలో బీఆర్‌ఏఓయూ మరో ముందడుగు

డిజిటల్ విద్యలో బీఆర్‌ఏఓయూ మరో ముందడుగు
01-08-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్‌తో చారిత్రక ఒప్పందం

ఏఐ, డిజిటల్ లెర్నింగ్, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధికి అంతర్జాతీయ సహకారం.

డిజిటల్ విద్యను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే దిశగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్‌ఏఓయూ) కీలక అడుగు వేసింది. కెనడాలోని కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL)తో డిజిటల్ విద్య, కృత్రిమ మేధస్సు (ఏఐ), అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక ఆధారిత బోధన రంగాల్లో సహకారం కోసం చారిత్రక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది.

వాంకోవర్‌లో జరిగిన కార్యక్రమంలో బీఆర్‌ఏఓయూ వైస్‌ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ అధ్యక్షుడు, సీఈవో ప్రొఫెసర్ పీటర్ స్కాట్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తెలంగాణ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెంకటేష్ ధోత్రే, ఉస్మానియా విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.

మూడు కీలక రంగాల్లో భాగస్వామ్యం

ఒప్పందం ప్రకారం డిజిటల్ లెర్నింగ్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, ఎల్‌ఎంఎస్‌, డిజిటల్ కోర్సులు, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, ఈ-బుక్స్, డిజిటల్ బ్యాడ్జ్‌లు, బీఆర్‌ఏఓయూ టీవీ, డిజిటల్ రేడియోతో పాటు విద్యలో ఏఐ వినియోగం, ఉమ్మడి పరిశోధనలు, అధ్యాపకుల శిక్షణ, బహుభాషా సాంకేతికతల అభివృద్ధికి ఇరు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి.

గేమ్‌ చేంజర్’గా నిలిచే ఒప్పందం

ఈ భాగస్వామ్యం విశ్వవిద్యాలయ చరిత్రలో ‘గేమ్‌ చేంజర్’గా నిలుస్తుందని వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల సాంకేతికతను అందుబాటులోకి తెచ్చి, తక్కువ ఫీజులతో నాణ్యమైన ఉన్నత విద్యను మరింత మంది విద్యార్థులకు చేరవేస్తుందని తెలిపారు.

అంతర్జాతీయ మోడల్‌గా బీఆర్‌ఏఓయూ

డిజిటల్ విద్యారంగంలో బీఆర్‌ఏఓయూ రూపొందిస్తున్న సమగ్ర విధానం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని COL సీఈవో ప్రొఫెసర్ పీటర్ స్కాట్ కొనియాడారు. ఈ ఒప్పందంతో బీఆర్‌ఏఓయూ ఏఐ ఆధారిత ఓపెన్, డిస్టెన్స్, డిజిటల్ లెర్నింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా, కామన్వెల్త్ దేశాల్లో నాణ్యమైన ఉన్నత విద్య విస్తరణకు కీలకంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Sthanikam

డిజిటల్ విద్యలో బీఆర్‌ఏఓయూ మరో ముందడుగు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News