Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:12 PM

షార్ట్ సర్క్యూట్ తో చెరువుగట్టు వద్ద అగ్నికీలలు

26-07-2026 346 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్‌పల్లి సమీపంలో పది దుకాణాలు దగ్ధం.. భారీ ఆస్తి నష్టం.

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు వద్ద ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి సమీపంలోని దుకాణాలకు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సుమారు పది దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదం కారణంగా దుకాణాల్లోని సామగ్రి పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం.

అగ్నిప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఆస్తి నష్టం విలువపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొనగా, స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.

Sthanikam

షార్ట్ సర్క్యూట్ తో చెరువుగట్టు వద్ద అగ్నికీలలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News