Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:08 AM

కోదాడ పట్టణంలో వాహనాల ముమ్మర తనిఖీ 50 వాహనాలు సీజ్

01-08-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై పోలీసులు శనివారం ఉక్కుపాదం మోపారు. కోదాడ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో పట్టణ పోలీస్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా ఒకే బైక్‌పై ముగ్గురు ప్రయాణించడం (ట్రిపుల్ రైడింగ్), మైనర్లు వాహనాలు నడపడం, మరియు నంబర్ ప్లేట్లు లేని 50 వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వాహనాలను పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహన చోదకులకు, మైనర్ల తల్లిదండ్రులకు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, టౌన్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై నిఘా ఉంచుతామని, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రమాదాల నివారణకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్, టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

కోదాడ పట్టణంలో వాహనాల ముమ్మర తనిఖీ 50 వాహనాలు సీజ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News