ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
కుటుంబ సమేతంగా సరికొత్త షాపింగ్ అనుభూతి..అన్ని వర్గాల వారికి విభిన్న ఫ్యాషన్ కలెక్షన్లు
యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో: జి.శ్రీనివాస్
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వరంగల్ మెయిన్ రోడ్డులో ప్రభుత్వ కాలేజ్ గ్రౌండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన గరుడ వస్త్ర సిల్క్స్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా హాజరై షోరూమ్‌ను ప్రారంభించారు. జక్కా రఘునందన్ రెడ్డి, అనంత్ రెడ్డి,జక్కా శ్యామంతకమణి,జక్కా మానీషా,జక్కా శ్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు,వ్యాపారవేత్తలు, ప్రముఖులు,ఫ్యాషన్ ప్రియులు,మహిళలు,స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సినీ నటి మీనాక్షి చౌదరిని చూసేందుకు అభిమానులు,సందర్శకులు ఆసక్తి కనబరిచారు. ఒకే వేదికపై సంప్రదాయం..ఆధునిక ఫ్యాషన్ కలెక్షన్లు
కుటుంబంలోని ప్రతి ఒక్కరి అభిరుచులకు అనుగుణంగా సంప్రదాయ,ఆధునిక వస్త్రాలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని గరుడ వస్త్ర సిల్క్స్ యాజమాన్యం తెలిపింది. వివిధ సందర్భాలకు అనువైన చీరలు,సంప్రదాయ దుస్తులు,ఆధునిక వస్త్రాలు,కుటుంబ సభ్యుల కోసం విభిన్న ఫ్యాషన్ కలెక్షన్లను షోరూమ్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.
నాణ్యత,అందం,వైవిధ్యం,తాజా ఫ్యాషన్ ట్రెండ్స్‌కు ప్రాధాన్యతనిస్తూ షోరూమ్‌ను తీర్చిదిద్దినట్లు యాజమాన్యం వివరించింది. అన్ని వర్గాల వినియోగదారులకు అనువైన వస్త్రాలను అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపింది.గరుడుడి స్ఫూర్తితో...కుటుంబ విలువలకు ప్రాధాన్యం హిందూ పురాణాల్లోని గరుడుడి కథ నుంచి తమ బ్రాండ్ తత్వానికి స్ఫూర్తి పొందినట్లు యాజమాన్యం వెల్లడించింది. గరుడుడికి ప్రతీకలుగా భావించే బలం,భక్తి,కరుణ,నిస్వార్థ ప్రేమ వంటి విలువలను సంస్థ ఆలోచనా విధానంలో ప్రతిబింబించేలా ముందుకు సాగుతున్నట్లు పేర్కొంది.
కుటుంబాల్లో ప్రేమ,ఐక్యత,అనుబంధాలను బలోపేతం చేయడంతో పాటు, ఆ విలువలను భవిష్యత్ తరాలకు అందించాలన్నదే తమ లక్ష్యమని తెలిపింది. గరుడ వస్త్ర ఫ్యామిలీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ ఆఫర్లను సద్వినియోగం చేసుకునే విధంగా ఈ సందర్భంగా గరుడ వస్త్ర సిల్క్స్ ప్రతినిధి జక్కా రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ...భువనగిరి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కుటుంబ సమేతంగా నూతన షోరూమ్‌ను సందర్శించాలని కోరారు. ప్రత్యేక వస్త్ర కలెక్షన్లతో పాటు ప్రారంభోత్సవ ఆఫర్లు,ఆకర్షణీయమైన లాంచ్ ప్రమోషన్లను వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపారు.
భువనగిరి ప్రజలకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసేందుకు సరికొత్త అనుభూతిని అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి,భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి,ఎంపీ డాక్టర్ జైకె.లక్ష్మణ్, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ,రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు,భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి,వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల,జిల్లా లైబ్రరీ చైర్మన్ అవలిస్ ఉర్ రహ్మాన్ చిష్టీ,మార్కెట్ కమిటీ చైర్మన్ కనుకుంట్ల రేఖ,భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్లు నకోటి నాగేష్,జలిగం విఘ్నేష్,పీఏసీఎస్ చైర్మన్ పకీరు కొండల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి