మునగాల మండలంలోని రైతులకు, మునగాల రైతు వేదికలో ఆత్మ పథకం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ నివేదిత ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం మరియు పంటల్లో నానో యూరియా, నానో డి.ఏ.పీ. వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, ఇఫ్కో, కోరమాండల్ కంపెనీ ప్రతినిధులు రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా KVK శాస్త్రవేత్త కిరణ్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం ద్వారా రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని క్రమంగా తగ్గించడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. స్థానికంగా లభించే సేంద్రియ వనరులను వినియోగించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని పేర్కొన్నారు.ప్రకృతి వ్యవసాయ రైతు మొగలూరి గోపి మాట్లాడుతూ ఈ పద్ధతుల వల్ల నేలలో సేంద్రియ పదార్థం పెరగడం, నేలలో తేమను నిలుపుకునే సామర్థ్యం మెరుగుపడటం, సూక్ష్మజీవుల కార్యకలాపాలు పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. దీర్ఘకాలంలో నేల సారాన్ని కాపాడుకోవడానికి ఈ పద్ధతులు దోహదపడతాయని తెలిపారు.రైతులు తమ పంటల అవసరాలకు అనుగుణంగా జీవ ఎరువులు, సేంద్రియ కషాయాలు, పంట అవశేషాల వినియోగం, అంతర పంటలు, పంట మార్పిడి వంటి పద్ధతులను అవలంబించాలని సూచించారు. తమ పొలాల్లో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకొని, నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ స్థిరమైన వ్యవసాయం వైపు ముందుకు సాగాలని అధికారులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కోదాడ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి పి.ప్రశాంతి, మండల వ్యవసాయ అధికారి బి.రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటేశ్వరరావు, మునగాల ఉప సర్పంచ్ కాసర్ల వెంకటేశ్వర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు,ఇఫ్కో జిల్లా అధికారి వెంకటేష్, కోరమాండల్ ఏరియా మేనేజర్ తిరుమల రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయంతో రైతులకు అనేక ప్రయోజనాలు..

Harish reporter

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి