రామన్నపేట సెప్టెంబర్ 21 స్థానికం ప్రతినిధి :
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ సర్వే పనులను సోమవారం మాజీ సర్పంచ్ గూత్త నరసింహారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే అధికారులతో మాట్లాడి, భూముల హద్దుల నిర్ధారణ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. సర్వే సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి భూముల హద్దులను పరిశీలించి, సంబంధిత వివరాలను సక్రమంగా నమోదు చేయాలని కోరారు.కార్యక్రమంలో ఆర్ఐ శోభ, సర్వేయర్ సోనీ, జూనియర్ అసిస్టెంట్ సుగుణాకర్, జీపీఓ లక్ష్మీదేవి, లైసెన్సుడ్ సర్వేయర్ నవీన్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి