Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బొమ్మల చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 05:45 PM

బొమ్మల చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

21-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ అక్షాంష్ యాదవ్

వినాయక నిమజ్జన ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంష్ యాదవ్ తెలిపారు. మండల పరిధిలోని చిన్నకొండూరు గ్రామంలోని బొమ్మల చెరువు వద్ద చేపట్టిన నిమజ్జన ఏర్పాట్లను సోమవారం ఆయన చౌటుప్పల్ డీఎస్పీ పి. మధుసూదన్ రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చెరువు వద్ద అవసరమైన మరమ్మతు పనులు, మౌలిక సదుపాయాలు, లైటింగ్ ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

​ఈ తనిఖీ కార్యక్రమంలో చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్, గ్రామ పంచాయతీ అధికారులు, ఆర్ అండ్ బీ, వైద్య, విద్యుత్ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బొమ్మల చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News