చౌటుప్పల్: వినాయక నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసిన బొమ్మల చెరువు, చిన్నకొండూరు విలేజ్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, చౌటుప్పల్ డీఎస్పీ పి. మధుసూదన్‌రెడ్డి సోమవారం సందర్శించి పరిశీలించారు. నిమజ్జనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
అలాగే నిమజ్జన ప్రదేశాల్లో చేపట్టాల్సిన మరమ్మతు పనులు, అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు. భక్తులకు, నిమజ్జనానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి