చిట్యాల, సెప్టెంబర్ 20: చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఆదివారం సంఘం ఆవరణలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కంచర్ల నారాయణచారి, ఉపాధ్యక్షుడిగా అనుముల ధనంజయాచారి, ప్రధాన కార్యదర్శిగా పంతంగి మదనాచారి, కోశాధికారిగా మండలోజు విజయకుమార్, సహాయ కార్యదర్శిగా వెల్లంకి విజయ్‌కుమార్, మహిళా కార్యదర్శిగా అనుముల ఈశ్వరమ్మ ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారులుగా మండలోజు బ్రహ్మచారి, అనుముల విశ్వరూపం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కంచర్ల నారాయణచారి మాట్లాడుతూ.. 1960లో ఏర్పడిన వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. విశ్వకర్మలు అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించి సమాజంలో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. సంఘ సభ్యుల సంక్షేమం, అభివృద్ధికి నూతన కార్యవర్గం సమష్టిగా పనిచేస్తుందని తెలిపారు.కార్యక్రమంలో అనుముల నరసింహాచారి, అనుముల నాగభూషణం, వెల్లంకి జగదీశ్వరచారి, అనుముల రమేష్‌చారి, మండలోజు శ్రీనివాసాచారి, వెల్లంకి పురుషోత్తమాచారి, అనుముల శ్రీనివాస్, అనుముల వెంకటాచారి, అనుముల విశ్వరూపంచారి, అనుముల కృష్ణకాంత్‌చారి తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి