కష్టమొస్తే కదలివచ్చిన 'టెన్త్' స్నేహం: స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం
కష్టాల్లో ఉన్న బాల్యమిత్రుడిని ఆదుకునేందుకు మేమున్నామంటూ 1998-99 పదో తరగతి బ్యాచ్ స్నేహితులు మానవత్వాన్ని చాటుకున్నారు. చిట్యాల మండల పరిధిలోని వెలిమినేడు గ్రామానికి చెందిన తమ సహచర విద్యార్థి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న మిత్రులు తక్షణమే స్పందించారు.బాధిత మిత్రుడితో పాటు, మిత్రుడి కుమారుడు కూడా అనారోగ్యానికి గురైనట్లు సమాచారం అందడంతో బ్యాచ్ సభ్యులంతా కలిసి ఉమ్మడిగా నిధులు సేకరించారు.
సేకరించిన ఆర్థిక సహాయాన్ని ఆదివారం బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టకాలంలో పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ, ఒకరికొకరు తోడుండాలనే సంకల్పంతో ఈ సాయం చేసినట్లు మిత్రులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బాల్యమిత్రులు బుట్టి వెంకటేశం, చెరుకు పాండు, బద్దం మల్లేష్ గౌడ్, గుండాల జంగయ్య గౌడ్, నిరంజన్, ఆరూరి రమేష్, ఆంజనేయులు, కానుగుల నవీన్, గోలి ఆంజనేయులు తదితరులు పాల్గొని బాధితునికి ధైర్యం చెప్పారు. ఆపదలో ఉన్న స్నేహితుడిని ఆదుకున్న 1998-99 టెన్త్ బ్యాచ్ సభ్యులను గ్రామస్తులు అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి