వంటమనిషి జీతం చేయడానికి రూ.14 వేల లంచం డిమాండ్ చేసిన హాస్టల్ వార్డెన్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం ఎస్టీ బాలుర హాస్టల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
హాస్టల్ వార్డెన్ భూక్యా వాల్ సింహ.. వంటమనిషి జీతం మంజూరు చేసేందుకు రూ.14 వేలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచం ఇవ్వడం ఇష్టంలేని వంటమనిషి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగారు.
ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికతో వల పన్నారు. అధికారుల సూచన మేరకు వంటమనిషి రూ.14 వేల లంచాన్ని వార్డెన్‌కు అందించగా, డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు. అనంతరం వార్డెన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి