Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఆధ్యాత్మిక శోభ.. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 09:08 PM

మెగా జాబ్ మేళా.. కోదాడకు పోటెత్తిన యువత

మెగా జాబ్ మేళా.. కోదాడకు పోటెత్తిన యువత

మెగా జాబ్ మేళా.. కోదాడకు పోటెత్తిన యువత
19-09-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

అన్ని దారులూ కోదాడ వైపే అన్నట్లుగా శనివారం వేలాది మంది యువత మెగా జాబ్ మేళాకు తరలివచ్చారు. సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ఉద్యోగార్థులతో కోదాడ పట్టణం కిక్కిరిసిపోయింది. వివిధ రంగాలకు చెందిన కంపెనీలు మొత్తం 5,620 మంది అభ్యర్థులను ఉద్యోగాలకు షార్ట్‌లిస్ట్ చేశాయి. వీరిలో 3,500 మందికి పైగా ఉద్యోగాలు దక్కే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.జాబ్ మేళాకు ముందుగానే 22 వేల మందికి పైగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోగా, కార్యక్రమ ప్రాంగణంలో మరో 10 వేల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య 32 వేలు దాటింది. ఈ అపూర్వ స్పందనతో గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన తెలంగాణలోని అతిపెద్ద నియామక కార్యక్రమాల్లో ఒకటిగా కోదాడ మెగా జాబ్ మేళా నిలిచింది. జాబ్ మేళా ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే 700 మందికి పైగా యువత ఉద్యోగాలు సాధించారు. ఇంటర్వ్యూలు, స్క్రీనింగ్ పరీక్షలు పూర్తయిన వెంటనే పలువురు అభ్యర్థులకు కంపెనీల ప్రతినిధులు నియామక పత్రాలు అందజేశారు.సమాచార సాంకేతికత, ఫార్మా, తయారీ, విమానయానం, మౌలిక సదుపాయాలు, వైద్యం, బ్యాంకింగ్‌, రిటైల్‌ తదితర రంగాలకు చెందిన సుమారు 350 కంపెనీలు ఈ భారీ నియామక కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఫాక్స్‌కాన్‌, ఎల్‌అండ్‌టీ, ఎంఐఏఎల్‌, మహీంద్రా, టాటా, అరవింద్‌, ఎంఎస్‌ఎన్‌, మెట్రో, గూగుల్‌, ఇండిగో, అపోలో, మెడ్‌ప్లస్‌తోపాటు అనేక ప్రముఖ, వర్ధమాన సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చాయి.ఉద్యోగార్థులు తమకు అందుబాటులో ఉన్న అవకాశాలను సులభంగా గుర్తించేందుకు జాబ్ మేళా ప్రాంగణంతోపాటు అధికారిక వెబ్‌సైట్‌లోనూ పాల్గొన్న కంపెనీల లోగోలను ప్రదర్శించారు. ఎల్‌అండ్‌టీ సంస్థ ఒక్కటే 40 మంది యువకులను ఎంపిక చేసి, సగటున నెలకు రూ.21 వేల వేతనం అందించనున్నట్లు తెలిపింది. ఇతర కంపెనీల ప్రతినిధులు కూడా రోజంతా ఇంటర్వ్యూలు నిర్వహించి సాంకేతిక, సాంకేతికేతర ఉద్యోగాలకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేశారు. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, కోదాడ ఎమ్మెల్యే ఎన్‌.పద్మావతిరెడ్డి జాబ్ మేళాను సందర్శించారు. కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగార్థులు, ఎంపికైన అభ్యర్థులతో మాట్లాడారు. ఉద్యోగాలు సాధించిన యువతకు నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతకు వారి సొంత ప్రాంతానికి దగ్గరలోనే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చిన కంపెనీలను ప్రశంసించారు.

Sthanikam

మెగా జాబ్ మేళా.. కోదాడకు పోటెత్తిన యువత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News