Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ పిఎసిఎస్ పర్సన్ ఇన్చార్జి కమిటీ ప్రమాణ స్వీకారం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 07:27 PM

పోయిరావయ్యా.. మళ్లీ రావయ్యా మా గణపతి

పోయిరావయ్యా.. మళ్లీ రావయ్యా మా గణపతి

పోయిరావయ్యా.. మళ్లీ రావయ్యా మా గణపతి
19-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణనాథుడికి వీడ్కోలు సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. దీంతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి పండుగకు హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉందన్నారు. వినాయకుడి పూజకు శాస్త్రీయ పరంగానూ ప్రాధాన్యత ఉందని, పండుగలో ఉపయోగించే పత్రి, పూలు, ప్రకృతి ఆధారిత పదార్థాలు పర్యావరణానికి, రైతులకు అనుబంధంగా ఉంటాయని తెలిపారు. విద్యార్థులు పండుగల వెనుక ఉన్న సాంస్కృతిక, శాస్త్రీయ అంశాలను తెలుసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు “పోయిరావయ్యా.. మళ్లీ రావయ్యా మా గణపతి” అంటూ నినాదాలు చేస్తూ గణనాథుడికి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఈవో పోలా గోవర్ధన్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పోయిరావయ్యా.. మళ్లీ రావయ్యా మా గణపతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News