రామన్నపేట సెప్టెంబర్ :
పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని బోగారం గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ అన్నారు. శనివారం బోగారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ–తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కూనూరు సాయికుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కీలకమన్నారు. పిల్లల చదువు, క్రమశిక్షణపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పాఠశాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు గ్రామంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రధానోపాధ్యాయురాలు హెచ్.ఎం. శ్రీలత పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపునకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. విద్యార్థుల ప్రగతి నివేదికలను తల్లిదండ్రులకు చూపించి వారి చదువుపై చర్చించారు.
కార్యక్రమంలో 5వ వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్‌యాదవ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పబ్బు జ్యోతి, అంగన్‌వాడీ టీచర్ బత్తుల వసంత, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి