Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గొడ్డలితో కూతురిపై తండ్రి దాడి అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 01:05 PM

ప్రభుత్వ కోటాలో మెడికల్‌ సీటు. వనపర్తి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో చేరిన మేడిపల్లి యువతి.

20-09-2026 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మేడిపల్లి, సెప్టెంబర్‌ 20: పట్టుదలతో చదివి మేడిపల్లి యువతి జిల్లామొని భావన ఎంబీబీఎస్‌ సీటు సాధించింది. వనపర్తి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ప్రభుత్వ కోటా కింద సీటు దక్కించుకుంది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిర్వహించిన రెండో విడత కౌన్సెలింగ్‌లో భావనకు సీటు కేటాయించారు.

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన జిల్లామొని వెంకటేష్‌, మంజుల దంపతుల కుమార్తె భావన. నీట్‌లో 1,31,878 జాతీయ ర్యాంకు సాధించి ఈ అవకాశాన్ని దక్కించుకుంది.

శనివారం వనపర్తి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో చేరిక ప్రక్రియను పూర్తి చేసి, కళాశాల ప్రిన్సిపాల్‌కు అవసరమైన పత్రాలను సమర్పించింది. భావనకు ఎంబీబీఎస్‌ సీటు రావడంపై కళాశాల అదనపు డీఎంఈ, ప్రిన్సిపాల్‌ అభినందనలు తెలిపారు. ఆమె తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

భావన వైద్య విద్యలో అడుగుపెట్టడంపై గ్రామస్థులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

ప్రభుత్వ కోటాలో మెడికల్‌ సీటు. వనపర్తి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో చేరిన మేడిపల్లి యువతి.

Article Image

మేడిపల్లి, సెప్టెంబర్‌ 20: పట్టుదలతో చదివి మేడిపల్లి యువతి జిల్లామొని భావన ఎంబీబీఎస్‌ సీటు సాధించింది. వనపర్తి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ప్రభుత్వ కోటా కింద సీటు దక్కించుకుంది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిర్వహించిన రెండో విడత కౌన్సెలింగ్‌లో భావనకు సీటు కేటాయించారు.

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన జిల్లామొని వెంకటేష్‌, మంజుల దంపతుల కుమార్తె భావన. నీట్‌లో 1,31,878 జాతీయ ర్యాంకు సాధించి ఈ అవకాశాన్ని దక్కించుకుంది.

శనివారం వనపర్తి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో చేరిక ప్రక్రియను పూర్తి చేసి, కళాశాల ప్రిన్సిపాల్‌కు అవసరమైన పత్రాలను సమర్పించింది. భావనకు ఎంబీబీఎస్‌ సీటు రావడంపై కళాశాల అదనపు డీఎంఈ, ప్రిన్సిపాల్‌ అభినందనలు తెలిపారు. ఆమె తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

భావన వైద్య విద్యలో అడుగుపెట్టడంపై గ్రామస్థులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News