సూర్యాపేట: ఖమ్మం–హైదరాబాద్ జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధం కాగా.. అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి సజీవ దహనమైనట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే విషయం ఇంకా స్పష్టతకు రాలేదు. మంటల తీవ్రతతో కారు పూర్తిగా కాలిపోవడంతో వివరాలు సేకరించడంలో పోలీసులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి