కోదాడ పట్టణంలో శనివారం నిర్వహించిన మెగా ఉద్యోగ మేళాలో జిల్లాఎస్పీ నరసింహఐపీఎస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి, సిబ్బందికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందజేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం సహకారంతో ముందస్తు ప్రణాళికతో భద్రతా చర్యలు చేపట్టడంతో భారీ సంఖ్యలో హాజరైన యువతీ యువకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కంపెనీల ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో భద్రత కల్పించామని ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, ఇంటర్వ్యూ స్టాల్స్, ప్రధాన వేదిక, భోజన ప్రదేశాల వద్ద పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉద్యోగ మేళా ప్రశాంతంగా విజయవంతమైందన్నారు.బందోబస్తు విధులు సమర్థవంతంగా నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కార్యక్రమానికి సహకరించిన జిల్లా యంత్రాంగం, నిర్వాహకులు, యువతీ యువకులు, కంపెనీల ప్రతినిధులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
మెగా ఉద్యోగ మేళాకు పటిష్ట పోలీస్ బందోబస్తు

Harish reporter

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి