గణపతి మండపం వద్ద విఘ్నేశ్వరునికి పూజలు.. భక్తులకు అన్నప్రసాద వితరణ
చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో వెలసిన గణపతి మండపం వద్ద హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు, గ్రామస్తులకు యూత్ సభ్యులు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ.. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులకు సేవ చేయాలనే సత్సంకల్పంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు. భక్తిభావంతో పాటు సేవాదృక్పథాన్ని పెంపొందించుకోవడానికే ఈ వేడుకలు వేదికగా నిలుస్తున్నాయన్నారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామంలో యువత ఇలాంటి సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ముందుండటం పట్ల గ్రామ పెద్దలు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ సభ్యులు ఆనగంటి వెంకటేష్, బాలగోని రవి, దబ్బటి యాదయ్య, అంతటి వెంకటేష్, కొమ్మగోని వెంకటేష్, ఆనగంటి మహేష్, బొడిగె శీను, బొడిగె నాగరాజు, షేక్ జానీ, షేక్ జహంగీర్, జగన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి