హయత్‌నగర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 18వ అవతరణ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్‌బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం కీలకమన్నారు. విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ఉన్నత విద్యలోనూ రాణిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత ఫైనల్ ఇయర్ విద్యార్థులు పోటీ పరీక్షలు, ఉన్నత విద్యపై దృష్టి సారించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ప్రతిభావంతులకు గోల్డ్ మెడల్స్
అకడమిక్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేసి సత్కరించారు. వివిధ ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. వ్యాసరచన, వక్తృత్వం, డ్రాయింగ్, రంగోలి తదితర పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
అలుమ్ని అసోసియేషన్ కోఆర్డినేటర్ డా. ఏ. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్స్, ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ సెక్రటరీ మధు మాట్లాడుతూ.. విద్యార్థులు పీజీ, పోటీ పరీక్షల్లో రాణించి భవిష్యత్తులో కళాశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ శ్రీనివాస్‌రెడ్డి, ఇందిర, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. మధు, అకడమిక్ కోఆర్డినేటర్ డా. శేఖర్, కల్చరల్ కోఆర్డినేటర్ డా. అపర్ణ చతుర్వేది, అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి