నెలలు నిండకముందే కేవలం 980 గ్రాముల బరువుతో జన్మించిన నవజాత శిశువుకు సంగారెడ్డి శిశురక్ష చిల్డ్రన్స్ ఆసుపత్రి వైద్యులు 50 రోజుల పాటు ప్రత్యేక చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. శిశువు ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో పాటు కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో డయాలసిస్ చేయాల్సి వచ్చింది. వెంటిలేటర్‌పై ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తూ వైద్యం అందించడంతో ప్రస్తుతం శిశువు ఆరోగ్యం మెరుగుపడి 980 గ్రాముల నుంచి 1.6 కిలోల బరువుకు చేరుకుంది. బిడ్డ తల్లిదండ్రులు తమ పరిస్థితిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి వివరించడంతో ఆయన వెంటనే శిశువును శిశురక్ష ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స విజయవంతం కావడంతో విషయం తెలుసుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి శిశువును పరామర్శించి వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సంగారెడ్డిలోనే అత్యవసర పరిస్థితుల్లో ఆధునిక వైద్యం అందించి పసిబిడ్డ ప్రాణాలు కాపాడటం అభినందనీయమని తెలిపారు. 50 రోజుల చికిత్సకు రూ.4 లక్షలకు పైగా ఖర్చు కాగా, తల్లిదండ్రులు సుమారు రూ.2 లక్షలు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని తాను చెల్లిస్తానని జగ్గారెడ్డి చెప్పగా, ఆసుపత్రి యాజమాన్యం మానవతా దృక్పథంతో బిల్లులో సగం మొత్తాన్ని మినహాయించింది.
శిశురక్ష వైద్యుల సేవలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభినందనలు

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి