చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలోని ఠాగూర్ విద్యాలయం కు చెందిన 8వ తరగతి విద్యార్థినులు పి ఐశ్వర్య, సిహెచ్ అక్షర అండర్–14 బాలికల కబడ్డీ విభాగంలో ప్రతిభ కనబరిచి నల్లగొండ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించినటువంటి క్రీడా పోటీలలో వీరిరువురు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు.మండల స్థాయి కబడ్డీ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఠాగూర్ విద్యాలయం విద్యార్థినులు ఇద్దరు జిల్లా స్థాయికి ఎంపిక కావడం విశేషం. మొత్తం మండలం నుంచి జిల్లా స్థాయికి కేవలం ఇద్దరు బాలికలు మాత్రమే ఎంపిక కాగా, వారిద్దరూ ఠాగూర్ విద్యాలయ విద్యార్థినులు కావడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.ఈ సందర్భంగా విద్యార్థినులకు పాఠశాల కరస్పాండెంట్ పెద్ది నరేందర్ మెమొంటోను అందజేశారు. జిల్లా స్థాయి పోటీల్లో కూడా ఇదే స్ఫూర్తితో ఆడి విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.
విద్యార్థినుల ప్రతిభకు పాఠశాల పి ఈ టి ఏం లింగస్వామి, ఉపాధ్యాయులు, సిబ్బంది, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాల చేస్తున్న కృషిని ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి