పాల్గొన్న చెరుకు స్వాతి-శివకుమార్ దంపతులు
చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 13వ వార్డు వలిగొండ రోడ్డులో ఉన్న వెంకటరమణ కాలనీలో శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన చెరుకు స్వాతి-శివకుమార్ దంపతులు కాలనీవాసులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్నదానం చేయడం ఎంతో పుణ్యఫలమని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాలనీవాసుల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన అన్నదాన పోషకులు జోర్కా రాజు-లహరి దంపతులకు, తమను ఆహ్వానించిన నిర్వహణ కమిటీ సభ్యులకు స్వాతి-శివకుమార్ దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి